Family Star First Week Collection: లైగర్ ఫస్ట్ డే కలెక్షన్లను కూడా దాటలేకపోయిన..విజయ్ ఫ్యామిలీ స్టార్ వీకెండ్ వసూళ్లు!

Family Star First Week Collection: లైగర్ ఫస్ట్ డే కలెక్షన్లను కూడా దాటలేకపోయిన..విజయ్ ఫ్యామిలీ స్టార్ వీకెండ్ వసూళ్లు!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family star) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొంతకాలంగా సరైన హిట్టు లేక బాధపడుతున్న విజయ్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. అదే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేశాడు. దాంతో..సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.తీరా..సినిమా చూశాక ఆడియన్స్ నుండి మాత్రం మిక్సుడ్ టాక్ వచ్చింది.కథలో కొత్తదనం లేదని, రొటీన్ సినిమానే ప్రేక్షకుల మీదకు వదిలారని కామెంట్స్ విపించాయి. 

ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ మీద పడింది. ఇక ది ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ బిజినెస్ విషయానికి వస్తే..నైజాం రూ.13.00 కోట్లు, సీడెడ్‌ రూ. 4.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ అన్ని ప్రాంతాల్లో కలిపి రూ.17.00 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక మిగతా భాషల్లో కలిపి రూ.3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్లు కలిపి.. మొత్తంగా ఈ సినిమాకు రూ.43 కోట్లు బిజినెస్ జరిగింది. 

ఇక రూ.45కోట్ల టార్గెట్తో వచ్చిన ఈ సినిమాకు మొదటిరోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి.సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ రావడంతో మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.00 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ. 8.20 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. నిజానికి విజయ్ దేవరకొండ స్టామినాకి ఇది చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవాలి.

 
వరల్డ్ వైడ్గా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కేవలం రూ.30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే సాధించింది. ఏప్రిల్ 11న ఏడో రోజు రంజాన్ ఫెస్టివల్ కూడా తోడైన కూడా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.94 లక్షల కలెక్షన్లే వచ్చాయి.

అంతేకాదు..విజయ్ దేవరకొండ కెరీర్లోనే డిజాస్టర్ గా మిగిలిపోయిన లైగర్ మూవీ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్లకుపైగా వసూలు చేసింది.ఈ కలెక్షన్స్ కూడా సినిమాపై ఉన్న బజ్ తో మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. మొత్తంగా ఫ్యామిలీ స్టార్ తెలుగు వెర్షన్ నెట్ కలెక్షన్లు రూ.16.83 కోట్లుగా ఉండగా..తమిళంలో వీకెండ్ మొత్తం కలిపి రూ.1.42 కోట్లు మాత్రమే వచ్చాయి.

ఇండియా గ్రాస్ కలెక్షన్లు రూ.21.15 కోట్లుగా, ఓవర్సీస్ లో రూ.9.5 కోట్లుగా ఉన్నాయి. ఇక ఫస్ట్ డే రూ.5.55 కోట్లతో మొదలైనా..ఏడో రోజుకు వచ్చేసరికి కోటి కూడా అందుకోలేకపోయింది. మొత్తానికి విజయ్ తన మూవీస్ తో సక్సెస్ అవ్వడం పెద్ద కష్టం అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది.మరి గౌతమ్ తిన్ననూరితో అయిన సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.