బర్త్ డే సెలబ్రేషన్స్ టైంలోనే కుప్పకూలిన బిల్డింగ్ : కేక్ తింటూనే 18 మంది మృతి..

బర్త్ డే సెలబ్రేషన్స్ టైంలోనే కుప్పకూలిన బిల్డింగ్ : కేక్ తింటూనే 18 మంది మృతి..

ముంబైకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరార్‌ సిటీలో బుధవారం అర్ధరాత్రి ఓ భవనం కూలి పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు.  వారిలో ఏడాది వయసున్న ఒక పాప, ఆమె తల్లి కూడా ఉన్నారు. అయితే 13 ఏళ్ల నాటి నాలుగు అంతస్తుల రమాబాయి అపార్ట్‌మెంట్‌లో ఈ సంఘటన జరిగింది.  ఆగస్టు 27న తెల్లవారుజామున 12:05 గంటల ప్రాంతంలో భవనం వెనుక భాగం అకస్మాత్తుగా కూలిపోగ,  శిథిలాల కింద అందులో ఉన్నవాళ్లు చనిపోయారని అధికారులు చెబుతున్నారు.

బర్త్ డే వేడుకలు: బాధితుల్లో జోయల్ కుటుంబం ఆగస్టు 27న వాళ్ల పాప ఉత్కర్ష జోయల్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది.  బిల్డింగ్ కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు తీసిన ఫోటోలలో ఇంటిని  బెలూన్లు, లైట్లతో డెకరేట్ చేసి, కుటుంబంతో కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.  అయితే నిమిషాల్లోనే ఈ భవనం కూలిపోవడంతో పాపతో సహా ఆమె 24 ఏళ్ల తల్లి ఆరోహి జోయల్ మరణించారు.

గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ తండ్రి ఓంకార్ జోయల్ ఆచూకీ ఇంకా లభించలేదు. జిల్లా విపత్తు నిర్వహణ అధికారి వివేకానంద్ కదమ్ ప్రకారం తల్లి, బిడ్డ ఇద్దరినీ శిథిలాల నుండి బయటకు తీయగా, ఆసుపత్రికి చేరుకునేలోపే వారు మరణించినట్లు చెప్పారు.

2012లో నిర్మించిన ఈ భవనంలో దాదాపు 50 ఫ్లాట్లు ఉండగా, కూలిపోయిన భాగంలో 12 ఫ్లాట్లు ఉన్నాయి. వాసాయి విరార్ మునిసిపల్ కార్పొరేషన్ (VVMC) ఈ భవనం అనధికారికంగా నిర్మించినట్లు తెలిపింది. భావన శిథిలాలు పక్కన ఉన్న ఇళ్లను కూడా ఢీకొట్టాయి, అయితే అదృష్టవశాత్తూ అందులో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

►ALSO READ | విద్యార్థులకు అమెరికా షాక్.. స్టూడెంట్ వీసా గడువుపై కొత్త లిమిట్స్, ఇక అలా కుదరదు..!

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), VVMC అగ్నిమాపక విభాగం నేతృత్వంలో జరిగిన ఈ సహాయక చర్యలు 30 గంటలకు పైగా కొనసాగాయి. అయితే ఈ ప్రదేశం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు మొదట కొంత ఆటంకం కలిగింది. ఇప్పటివరకు 18 మంది  మరణించగ, ఆరుగురుని శిథిలాల నుండి వెలికితీశారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. 

ఘోర ప్రమాదం తర్వాత  అరెస్టు: భవనం కూలిపోయిన తరువాత VVMC డెవలపర్‌పై ఫిర్యాదు నమోదు చేసి అరెస్టు చేశారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకొని ఉండొచ్చని, వారికోసం వెతికే పనులు కొనసాగుతున్నయని  జిల్లా అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా పక్కన ఉన్న భవనాలలో ఉన్న వారిని ఖాళీ చేయించి చందన్సార్ సమాజ్‌మందిర్‌కు తరలించి, అక్కడ వారికీ ఆహారం, నీరు ఇంకా వైద్య సహాయం అందిస్తున్నారు.