
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ వీసాల గడువు విషయంలో కొత్త నిబంధనలు తీసుకురావాలని చూస్తోంది. దీంతో విదేశాల నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన వీసా హోల్డర్లకు షాకిచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ రూల్స్ తొలగించాలని నిర్ణయించింది. దీనికి బదులు ఫిక్స్‌డ్ గడువుతో కూడిన రూల్స్ ప్రవేశపెట్టేందుకు ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో మార్పులకు శ్రీకారం చుడుతోంది.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ తీసుకొస్తున్న మార్పులు అకడమిక్ స్టూడెంట్స్(F), ఎక్స్ఛేంజ్ విజిటర్స్ (J), విదేశీ మీడియా ప్రతినిధులు(I) కేటగిరీల కింద ఇచ్చే వీసాల నిబంధనలు మారనున్నాయని తెలుస్తోంది. ఈ కేటగిరీ వీసా కలిగిన వ్యక్తులు తమ స్టేషస్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నంత వరకు నిరవధికంగా అమెరికాలో ఉండటానికి అనుమతిస్తున్నాయి ప్రస్తుత వ్యవస్థ - ఇమ్మిగ్రేషన్ రూల్స్. దీని వల్ల అమెరికాలోని అధికారులకు సదరు విదేశీయులు ఆథరైజ్డ్ కార్యకలాపాల్లో మాత్రమే పాల్గొంటున్నారని నేరుగా ధృవీకరించడానికి అవకాశం లభించకపోవటంతో కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు.
Also Read : భారీ వర్షాలకు కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
కొత్తగా ప్రతిపాధించిన మార్పులు..
* F , J వీసా హోల్డర్లు అమెరికాలో గరిష్టంగా 4 సంవత్సరాల స్టే చేసేందుకు మాత్రమే అనుమతించటం.
* F-1 వీసా కలిగిన విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత అందిస్తున్న గ్రేస్ పీరియడ్ 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించటం.
* గ్రాడ్యుయేట్-స్థాయి F-1 విద్యార్థులు కోర్సు మధ్యలో ప్రోగ్రామ్‌లను మార్చుకోవడంపై పరిమితులు.
* I వీసాహోల్డర్లకు అడ్మిషన్ గడువు 240 రోజులకు లిమిట్ చేస్తూ.. కొన్ని చైనా కేసుల్లో మినహాయింపు ఇవ్వటం.
అమెరికా తన అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికంగా ఉన్న అడ్మిషన్లను కట్టడి చేయాలని కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ తీసుకొస్తోంది. దీంతో ఇకపై నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలపై వెళ్లే విదేశీయులు ఎన్నాళ్లయినా అమెరికాలో ఉంటామంటే కుదరదని తేల్చి చెప్పిన హోంల్యాండ్ సెక్యూరిటీ. తాజా రూల్స్ కింద ముందుగానే పెట్టిన గడువు తర్వాత వీసా హోల్డర్లు అమెరికాలో నివసించటానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని వీటిని అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హోంల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరిస్తోంది.