విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నవంబర్ 22న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా, ఆదివారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ సాగిన ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎంటర్‌టైనింగ్‌గానూ ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా.
రిలీజ్‌కు ఒకరోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తూ, రెండోసారి సినిమా చూసే రేంజ్‌లో ఉంటుంది’ అని చెప్పాడు. ఇందులో తన పాత్ర అందర్నీ ఆకట్టుకుంటుందని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పింది. దర్శకుడు రవితేజ మాట్లాడుతూ ‘ట్రైలర్‌లో చూసింది కొంతే. ఇంకా చాలా కంటెంట్ ఉంది. అవన్నీ ఎక్సయిటింగ్‌గా ఉంటాయి’ అని అన్నాడు. మాస్ కా దాస్ రేంజ్‌లోనే సినిమా ఉంటుందని, థియేటర్స్‌లో మాస్ జాతర ఖాయమని నిర్మాత రామ్ తాళ్లూరి అన్నారు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.