బండి సంజయ్ చాలా ధైర్యంగా ఉన్నారు

బండి సంజయ్ చాలా ధైర్యంగా ఉన్నారు

సీఎం, మంత్రుల మీటింగ్స్ కి కోవిడ్ నిబంధనలు వర్తించవా ?  అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను  జైలులో పరామర్శించారు. జాగరణ దీక్షణ సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వివేక్ వెంకటస్వామి..  బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు నియంతృత్వమన్నారు. బండి సంజయ్  చాలా ధైర్యంగా ఉన్నారని... 317 జీవో సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.

టీచర్ల సమస్యలను పరిష్కరించాలంటూ బండి సంజయ్ జనవరి 2న రాత్రి  దీక్షకు దిగారు. అయితే ఆ దీక్షకు అనుమతులు లేవంటూ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కోర్టు బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో బీజేపీ శ్రేణులు 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. జిల్లా, మండల కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొనాలని తెలిపాయి. అందులో భాగంగా దీక్షలలో పాల్గొనడానికి వెళ్తున్న నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నాయి.