గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్ సిడ్నీ వర్సిటీ సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ కోర్సు బీఎస్సీ(ఆనర్స్)లో ప్రవేశానికి గురువారం ఉదయం 10 గంటలకు వాక్ -ఇన్ -కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్విద్యాసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ ప్రాయోజిత కోటా బీఎస్సీ అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఒరిజినల్సర్టిఫికెట్లు, వెబ్సైట్లో పేర్కొన్న రుసుముతో రాజేంద్రనగర్ వర్సిటీలోని సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్ మెంట్ ఆడిటోరియంలో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలు వర్సిటీ వెబ్ సైట్ www.pjtau.edu.in లో చూడాలని పేర్కొన్నారు.
