వాట్సాప్​ కొత్త ఫీచర్

వాట్సాప్​ కొత్త ఫీచర్

వాట్సాప్​ యూజర్లు మల్టీ డివైజ్​లలో వాడేందుకు కొత్త ఫీచర్ తీసుకొచ్చింది మెటా. విండోస్​ డెస్క్​టాప్ వాడేవాళ్ల కోసం కొత్త వాట్సాప్ యాప్​ డిజైన్ చేసింది. అయితే, దాన్ని మొబైల్​లో వాట్సాప్ ఎలా వాడతారో, అలానే వాడొచ్చు. అంతే స్పీడ్​గా పనిచేస్తుంది. అలాగే ఒకేసారి నాలుగు డివైజ్​లలో వాట్సాప్​ లింక్ చేసి, వాడుకునే వీలుంది. సాధారణంగా వాట్సాప్​ని మొబైల్​లో వాడతారు. కొందరు వెబ్ వాట్సాప్ ద్వారా సిస్టమ్​లో చాట్ చేస్తారు. అలానే ల్యాప్​ టాప్, ట్యాబ్​లలోనూ వాడతారు. ఇలా మొబైల్​ నుంచి వేరే డివైజ్​లలో ఏదో ఒకదానికి కనెక్ట్ చేసి వాడతారు. కానీ, ఇప్పుడు మొబైల్, ల్యాప్​టాప్, ట్యాబ్, సిస్టమ్​ నాలుగింటికి ఒకేసారి కనెక్ట్ చేసి వాట్సాప్​ వాడొచ్చు. ఒక మెసేజ్​ మొబైల్ నుంచి, రెండో మెసేజ్ ల్యాప్​టాప్​ నుంచి ఇవ్వొచ్చు. అంతేకాదు, మొబైల్​ ఆఫ్​లైన్​లో ఉన్నా మెసేజ్​లు సింక్​, ఎన్​క్రిప్ట్​ అవుతాయి. ఇలా నాలుగు మెసేజ్​లు నాలుగు డివైజ్​ల నుంచి ఇవ్వొచ్చు.

విండోస్​ డెస్క్​టాప్​ మీద వాట్సాప్​ అప్​డేట్ చేసుకుంటే కొత్త ఫీచర్స్​ కూడా వాడుకోవచ్చు. వాటిలో వాయిస్, వీడియో కాల్ ఆప్షన్స్ ఉన్నాయి. అలా చేయాలంటే ముందే లింక్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎక్కువగా మొబైల్​ ఛార్జింగ్ లేనప్పుడు లేదా ఛార్జింగ్ సేవ్ చేసుకోవాలన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. అదెలాగంటే... ముందుగా ఫోన్​ నెంబర్​ లింక్​ అయిన డివైజ్​లో వాట్సాప్ ఓపెన్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్​కి వెళ్లి ‘లింక్డ్​ డివైజెస్’ సెలక్ట్ చేయాలి. ‘లింక్​ ఎ న్యూ డివైజ్’ క్లిక్​ చేసి, అందులో కనిపించే ఇన్​స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. రెండో డివైజ్​లో ఓపెన్​ చేయాలంటే, వెబ్ బ్రౌజర్​లో వెబ్ వాట్సాప్​ పేజ్​ ఓపెన్ చేయాలి. తర్వాత క్యూఆర్ కోడ్​ స్కాన్​ చేయాలి. డివైజ్​ సింక్ అయ్యాక చాట్స్ అన్నీ సెకండ్​ డివైజ్​లో కనిపిస్తాయి. ఇదే విధంగా మిగతా డివైజ్​లలో లింక్​ చేయాలి. ఏదైనా డివైజ్​ నుంచి అన్​లింక్​ చేయాలంటే వాట్సాప్​ నుంచి ఎప్పుడైనా లాగవుట్ కావచ్చు. ఆన్​లైన్​లో ఉండి చాట్ చేయాల్సిన పనిలేదు.14 రోజుల వరకు ఫోన్​ వాడకపోతే, మిగతా డివైజ్​లలో ఆటోమెటిక్​గా వాట్సాప్ లాగవుట్ అవుతుంది. దాంతో ఫోన్​లో వాట్సాప్​ అకౌంట్ రిజిస్టర్ చేసుకుని, కొత్త డివైజ్​లకు లింక్ చేసుకోవాలి.