జముయి నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యే అయిన శ్రేయసి సింగ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొత్త మంత్రివర్గంలో భాగంగా గురువారం రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 సీట్లలో ఎన్డీఏ కూటమి 202 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు పాల్గొన్నారు, అలాగే నితీష్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు.
క్రీడాకారిణి నుండి రాజకీయాల్లోకి: శ్రేయసి సింగ్ మొదట ఒక గొప్ప షూటర్. తరువాతే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ & మాజీ ఎంపీ పుతుల్ కుమారి కుమార్తె. ఆమెది బలమైన రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం.
శ్రేయసి సింగ్ కి గొప్ప స్పోర్ట్స్ కెరీర్ ఉంది అలాగే ఆమెకి అర్జున అవార్డు కూడా లభించింది. 2018 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ షూటింగ్‌లో గోల్డ్ మెడల్, 2014 కామన్వెల్త్ క్రీడల్లో వెండి పతకం, 2014 ఆసియా క్రీడల్లో టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలిచింది. బీహార్ నుండి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన మొదటి షూటర్ కూడా ఈమేనే.
రాజకీయ ప్రయాణం: శ్రేయసి సింగ్ 2020లో బీజేపీలో చేరారు. అప్పటి నుండి జముయి నుండి పోటీ చేస్తున్నారు. 2020 ఎన్నికల్లో ఆమె ఆర్జేడీ అభ్యర్థిని సుమారు 41,000 ఓట్ల తేడాతో ఓడించారు. ఈసారి కూడా ఎన్నికల్లో ఏకంగా 54 వేల కంటే మెజారిటీ ఓట్ల తేడాతో గెలిచి జముయి సీటును మళ్లీ దక్కించుకుంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 89 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది, ఆ తరువాత నితీష్ కుమార్ పార్టీ (జెడీయూ) 85 సీట్లు గెలిచింది.
►ALSO READ | Australia vs England: రేపటి (నవంబర్ 21) నుంచి యాషెస్ స్టార్ట్.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్, స్క్వాడ్ వివరాలు!
బీజేపీలో ఆమెకు పెరుగుతున్న ప్రాముఖ్యత, జముయి ప్రజల్లో ఆమెకు ఉన్న ఆదరణ కారణంగా ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కొత్త మంత్రివర్గంలో చేరిన 20 మంది మంత్రులలో శ్రేయసి సింగ్ కూడా ఉన్నారు. ఆమె నియామకం ద్వారా యువ నాయకులను, బాగా పనిచేసిన వారికి పార్టీ ప్రోత్సాహం ఇస్తుందని అర్థమవుతోంది. అంతర్జాతీయ క్రీడా ప్రపంచం నుండి బీహార్ రాజకీయాల్లోకి వచ్చిన శ్రేయసి సింగ్ ఇప్పుడు క్రీడల్లోనూ, ప్రజలకు సేవ చేయడంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.
