Australia vs England: రేపటి (నవంబర్ 21) నుంచి యాషెస్ స్టార్ట్.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్, స్క్వాడ్ వివరాలు!

Australia vs England: రేపటి (నవంబర్ 21) నుంచి యాషెస్ స్టార్ట్.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్, స్క్వాడ్ వివరాలు!

క్రికెట్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ కు ఎంత స్పెషల్ క్రేజ్ ఉందో క్రికెట్ లవర్స్ కు బాగా తెలుసు. 140 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ను రెండు జట్లు చాలా సీరియస్ గా తీసుకుంటాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తాయి.  క్రికెట్ లో తొలి మ్యాచ్ నుంచి వీరి మధ్య సమరం ఇప్పటికీ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. శుక్రవారం (నవంబర్ 21) నుంచి ఈ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ స్టార్ట్ అవుతుంది.  ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగుతుంది. 1882లో తొలిసారి యాషెస్ సిరీస్‌ జరిగింది.

సొంతగడ్డపై జరగబోయే ఈ టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. మరోవైపు 2015 నుంచి యాషెస్ గెలవని ఇంగ్లాండ్ ఎలాగైనా ఆసీస్ కు షాక్ ఇవ్వాలని చూస్తోంది. హోమ్ గ్రౌండ్ కావడంతో ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా ప్రధాన ఫాస్ట్ బౌలర్లు పాట్ కమిన్స్, జోష్ హేజల్ వుడ్ అందుబాటులో లేకపోవడంతో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయంపైధీమాగా ఉంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టుకు స్టోక్స్, ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేయనున్నారు. 

యాషెస్ చరిత్ర చూసుకుంటే ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య మొత్తం 330 యాషెస్‌ టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 136 టెస్టులు, ఇంగ్లండ్‌ 108 టెస్టులు గెలవగా.. 91 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. చివరిసారిగా ఇంగ్లాండ్ లో జరిగిన యాషెస్ 2-2 తో సమమైంది. తొలి రెండు టెస్టులు ఆస్ట్రేలియా గెలిస్తే చివరి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ రెండు టెస్టులు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. అంతకముందు 2021-22 యాషెస్ లో ఆస్ట్రేలియా 4-0తో గెలిచింది. ఆస్ట్రేలియా చివరి 15 స్వదేశీ టెస్టుల్లో రెండింటిలో మాత్రమే ఓడిపోయింది. దీంతో ఈ సిరీస్ లో కంగారులను నిలువరించాలంటే ఇంగ్లాండ్ కు పెద్ద సవాలుగా మారింది. 

లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:

లైవ్ టెలికాస్ట్:  స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది

లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్ లో లైవ్ చూడొచ్చు. 

ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్:
 
తొలి టెస్ట్: 21 నవంబర్ (శుక్రవారం)- పెర్త్ స్టేడియం- ఉదయం 8 గంటలకు (భారత కాలమాన ప్రకారం)
  
రెండవ టెస్ట్ – డిసెంబర్ 4 (గురువారం)- గబ్బాలోని బ్రిస్బేన్ ఉదయం 10 గంటలకు (భారత కాలమాన ప్రకారం)

మూడవ టెస్ట్ – 17 డిసెంబర్ (బుధవారం)- అడిలైడ్ ఓవల్,  ఉదయం 5 గంటలకు (భారత కాలమాన ప్రకారం)

4వ టెస్ట్ – 26 డిసెంబర్ (శుక్రవారం)- MCG, మెల్‌బోర్న్ ఉదయం 5 గంటలకు (భారత కాలమాన ప్రకారం)

5వ టెస్ట్ - 4 జనవరి 2026 (ఆదివారం)- SCG, సిడ్నీ ఉదయం 5 గంటలకు (భారత కాలమాన ప్రకారం)


ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ స్క్వాడ్ ( తొలి టెస్టుకు మాత్రమే) 

ఆస్ట్రేలియా:

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ , బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్ , ట్రావిస్ హెడ్ , జోష్ ఇంగ్లిస్ , ఉస్మాన్ ఖవాజా , మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియాన్ , మైఖేల్ నేసర్ , మిచెల్ స్టార్క్ , జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్ .  

ఇంగ్లాండ్:

బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్ , గస్ అట్కిన్సన్ , షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్ , బ్రైడాన్ కార్స్ , జాక్ క్రాలే , బెన్ డకెట్ , ఓల్లీ పోప్, జో రూట్ , జామీ స్మిత్ (వికెట్ కీపర్), మార్క్ వుడ్ .