మహాలయ పక్షాల్లో.. పితృదేవతలు ఎవరెవరికి అన్నం పెట్టాలి.. పూర్తి వివరాలు..

మహాలయ పక్షాల్లో.. పితృదేవతలు ఎవరెవరికి అన్నం పెట్టాలి.. పూర్తి వివరాలు..

మహాలయ పక్షాల రోజుల్లో  పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చడానికి ఆయా వంశీకులు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, దానధర్మాలు చేయాలి. ఈ సమయంలో పితృదేవతలను సంతృప్తి ప‌ర‌చ‌డంతో పాటు ఇంట్లో ప్రతికూల‌త‌ల‌ను తొలగుతాయని పండితులు చెబుతున్నారు.  మహాలయపక్షాల్లో ఎవరెవరికి అన్నం పెట్టాలి.. తర్పణాలు వదలాలి.. పిండ ప్రదానం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

పితృ దేవతలు భూమిపై సంచరించే  కాలం జరుగుతుంది.  ప్రతి సంవత్సరం బాధ్రపదమాసం కృష్ణ  పక్షం 15 రోజులను మహాలయ పక్షం అంటారు.  ఈ ఏడాది ( 2025) మహాలయ పక్షాల రోజులు సెప్టెంబర్​​ 21 వరకు కొనసాగుతాయి.  ఈ రోజుల్లో పితృదేవతలను పూజించి.. వారికి అన్నం పెట్టాలని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. 

  • తండ్రి    
  • తండ్రి తండ్రి    
  • తండ్రి తాత 
  • తండ్రి అన్నదమ్ములు   
  • తల్లి        
  • సవతి తల్లి     
  • తల్లి అత్తగారు    
  • తల్లి అత్తగారి అత్తగారు    
  • తల్లి తండ్రి    
  • తల్లి తాత        
  • తల్లి తాత తండ్రి        
  • తల్లి తల్లి        
  • తల్లి నాయిన్మమ్మ        
  • తల్లి నాయునమ్మ అత్తగారు        
  • మేనమామలు    
  • మేనత్తలు     
  • మేనత్త భర్త        
  • మేనత్త        
  • మేనత్తల భర్తలు        
  • అక్క చెల్లెళ్లు    
  • అక్క చెల్లెళ్ల భర్తలు
  • తల్లి అక్క చెల్లెళ్లు        
  • గురువు        
  • జగద్గురువు కంచి కామకోటి పీఠాధిపతులు

గమనిక:  మరణించిన  వారికి మాత్రమే పిండ ప్రదానం చేయాలి.  అలాగే  తండ్రి జీవించి ఉండి.. తల్లి కాలం చేసిన ఎడల... అలాంటి వారు ఒక్క తల్లికి మాత్రమే  తర్పణాలు వదలాలి.  ఆడ పిల్లలు మాత్రమే ఉండి వారి తల్లి దండ్రులు మరణించిన ఎడల పెద్ద కుమార్తె మొదటి కుమారుడు ( దౌహోత్రుడు) అమ్మమ్మ.. తాతయ్యలకు  కేవలం తర్పణాలు మాత్రమే వదలాలి. పిండ ప్రదానం చేయరాదు.. ఒకవేళ అలాంటి సందర్భంలో కార్యక్రమం చేసే వ్యక్తికి తండ్రి జీవించి లేకపోతే ... పిండ ప్రదానం కూడా చేయవచ్చని పండితులు చెబుతున్నారు.   మనం తెలిసో.. తెలియకో... కొంతమందికి ఆబ్ధికాలు ( తద్దినాలు) పెట్టము.  అలాంటి వారు బాధ్రపద మాసం అమావాస్య రోజు ( సెప్టెంబర్​ 21)న పూర్వీకులను యథావిథిగా పూజించి... తర్పణాలు వదలితే అంతటి ఫలితం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.