ఒమిక్రాన్ పై WHO వార్నింగ్

ఒమిక్రాన్ పై WHO వార్నింగ్

ఒమిక్రాన్ రీఇన్ఫెక్షన్ రేటు  డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు ఎక్కువ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) చీఫ్​ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ఆస్పత్రుల్లో చేరుతున్నోళ్ల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉందని, మరికొన్ని రోజుల తర్వాతే వ్యాధి తీవ్రతపై స్పష్టత వస్తుందన్నారు. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఎక్కువగా పిల్లలకు సోకుతున్నట్లు రిపోర్టులను బట్టి తెలుస్తోందన్నారు. ఒమిక్రాన్ తో పిల్లలు, వ్యాక్సిన్ వేస్కోనోళ్లకు ముప్పు ఎక్కువ ఉండొచ్చని చెప్పారు. మరోవైపు ఒమిక్రాన్​పై  ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హెచ్చరించింది. సరైన చర్యలు తీస్కోకపోతే భారీ స్థాయిలో థర్డ్ వేవ్ రావొచ్చని, వెంటనే  వ్యాక్సినేషన్ పై ఫోకస్ పెట్టాలని సూచించింది.
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రీఇన్ఫెక్షన్ రేటు.. డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు ఎక్కువ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) చీఫ్​సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ఆస్పత్రుల్లో చేరుతున్నోళ్ల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. అయితే మరికొన్ని రోజుల తర్వాతే వ్యాధి తీవ్రతపై స్పష్టత వస్తుంది” అని చెప్పారు. ‘‘సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇది ఎక్కువగా పిల్లలకు సోకుతున్నట్లు రిపోర్టులను బట్టి తెలుస్తోంది” అని పేర్కొన్నారు. ఒమిక్రాన్ తో పిల్లలకు, వ్యాక్సిన్ వేస్కోనోళ్లకు ముప్పు ఎక్కువ ఉండొచ్చని.. కేసులు పెరిగే కొద్దీ పిల్లలు, వ్యాక్సిన్ వేస్కోనోళ్లు ఎక్కువ మంది వైరస్ బారినపడే ప్రమాదం ఉందన్నారు. కాగా, ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువని.. డెల్టా, బీటా వేరియంట్లతో పోలిస్తే రీఇన్ఫెక్షన్ రేటు కూడా ఎక్కువని సింగపూర్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్నోళ్లకు ఒమిక్రాన్ సోకే ప్రమాదం ఎక్కువుందని పేర్కొంది.
వ్యాక్సినేషన్​ పెంచాలె: ఐఎంఏ
‘దేశంలో పరిస్థితి సాధారణ స్థితికి వస్తున్న టైమ్ లో ఇది పెద్ద ఎదురుదెబ్బే. సరైన చర్యలు తీస్కోపోతే భారీ స్థాయిలో థర్డ్ వేవ్ రావొచ్చు” అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హెచ్చరించింది. మంగళవారం ఢిల్లీలో ఐఎంఏ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అవి పెరిగే అవకాశం ఉంది. ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని, కానీ డెల్టా కంటే 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి” అని సూచించారు. ప్రజలందరికీ టీకా అందేలా చూడాలని పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు, ముప్పు ఎక్కువున్నోళ్లకు అడిషనల్ డోస్ ఇవ్వాలని.. 12 నుంచి 18 ఏండ్ల పిల్లలకూ టీకాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.