- ధూల్‌పేట్‌లో మహిళ అరెస్ట్
- 10 గంజాయి ప్యాకెట్లు సీజ్
హైదరాబాద్, వెలుగు : చూడడానికి అచ్చంగా పసుపు ప్యాకెట్ల మాదిరిగానే ఉంటాయి. విప్పిచూస్తే గానీ తెలియదు అందులోని గంజాయి ఉందని! పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు చిక్కకుండా గంజాయి పెడ్లర్లు ఇలా కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ధూల్‌పేట్ కేంద్రంగా సాగుతున్న పసుపు ప్యాకెట్ల గంజాయి దందాను ఎక్సైజ్ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఛేదించారు.
దూల్‌పేట్‌లో సోమవారం తనిఖీలు చేసి, నేహా భాయ్ అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఇంట్లో పసుపు కవర్స్‌తో ప్యాక్ చేసిన10 గంజాయి ప్యాకెట్లను సీజ్ చేశారు. వీటిని వైజాగ్ ఏజెన్సీల నుంచి హోల్‌సెల్‌గా కొనుగోలు చేసి రిటైల్‌గా అమ్ముతున్నట్లు గుర్తించారు. నేహా భాయ్‌కి గంజాయిని సప్లై చేసిన పెడ్లర్ల వివరాలు సేకరిస్తున్నారు.