దుర్గ గుడి ఫ్లైఓవర్ పై రెచ్చిపోతున్న యువకులు

V6 Velugu Posted on Sep 28, 2021

  • ఎప్పుడు పడితే అప్పుడు రేసింగులు..
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆకతాయిల విన్యాసాలు

విజయవాడ: దుర్గ గుడి ఫ్లై ఓవర్ పై ఆకతాయిల వీరంగం రోజు రోజుకూ శృతి మీరుతోంది. తమకు అడ్డే లేదు అన్నట్లు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అదును చూసి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. సినిమా ఫైటింగ్ స్టంట్లు.. బైకుపై నిలబడి ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండడమే కాదు..  రివాల్వార్ తో  గాలిలో కాలుస్తూ  సదరు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. పట్టపగలు, రాత్రి అనే తేడా లేకుండా నడిరోడ్డుపై బైక్ పై నిలబడి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ... గన్ తో గాలిలో కాలుస్తున్నట్లు విన్యాసాలు చేస్తున్నారు. కేటీఎం (KTM), పల్సర్ 220 బైక్ లపై యువకులు హల్ చల్.. చేసిన ఫోటోలు, వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సదరు ఆకతాయిలు తమ వాహనాలు పట్టుబడకుండా బైకుల నెంబర్ ప్లేట్లు తీసేసి రోడ్లపై విన్యాసాలు చేస్తున్నారు. కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఫ్లై ఓవర్ పై రేసింగులకు దిగుతుండడంతో ఇతర వాహనాల వారికి.. ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 


 

Tagged VIjayawada, Amaravati, Rash driving, ap today, durga temple, , bejawada, ap aupdates, durga flyover, indra keeladri fly over, young men bike racing, performing stunts with gun, standing on byke..rash driving

Latest Videos

Subscribe Now

More News