కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోట్లేదు

కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోట్లేదు

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసు పరిమితి లేకుండా అందరికీ రైతు బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. దీనిపై కేసీఆర్ స్పందించక పోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను తీర్చాలంటూ షర్మిల సీఎంకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

రుణమాఫీ చేస్తామని సీఎం చెప్పి ఎన్నేళ్లు అయ్యిందని ప్రశ్నించారు. కేవలం రూ.25వేల లోపు రుణం ఉన్న మూడు లక్షల మందికి మాత్రమే చేశారన్నారు షర్మిల. 36 లక్షల మంది రైతులను టీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలు అలాగే ఉన్నాయని.. వాటికి రైతులే వడ్డీలు కడుతున్నారని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని...అప్పులు తీర్చలేక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వానికి కనీస మానవత్వం  కలగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.

 

మరిన్ని వార్తల కోసం..

స్కూల్స్ పై యూపీ సర్కార్ కీలక నిర్ణయం