స్కూల్స్ పై యూపీ సర్కార్ కీలక నిర్ణయం

స్కూల్స్ పై యూపీ సర్కార్ కీలక నిర్ణయం

భారత్ లో కరోనా కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూల్ కాలేజీలు మూతపడ్డాయి. పిల్లలకు ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే ఈక్రమంలో యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్ని మరికొన్ని రోజులు తెరవకూడదని ప్రబుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండగా.. ఈ సమయంలోనే యూపీలో విద్యా సంస్థలను తెరవవద్దని ఆదేశాలు ఇచ్చింది  యోగి ప్రభుత్వం. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలను ఫిబ్రవరి 15వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ తరగతులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. గతంలో పెరిగిన కరోనా కేసుల మధ్య, జనవరి 30వ తేదీ నాటికి ఉత్తరప్రదేశ్‌లోని విద్యా సంస్థలను మూసివేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అంతకుముందు జనవరి 23వ తేదీ వరకు మాత్రమే పాఠశాలలు కళాశాలను మూసివేయాలని ప్రభుత్వం భావించింది.

ఇవి కూడా చదవండి: 

చిరంజీవికి సీఎం కేసీఆర్ ఫోన్

నెలరోజుల్లో హైకోర్టుకు కొత్త జడ్జిలు