క్రేజీ జాబ్ ఆఫర్: రూ.25 లక్షల జీతంతో పాటు.. కొత్త ఫోన్లు, జొమాటో క్రెడిట్స్, జిమ్ మెంబర్ షిప్

క్రేజీ జాబ్ ఆఫర్: రూ.25 లక్షల జీతంతో పాటు.. కొత్త ఫోన్లు, జొమాటో క్రెడిట్స్, జిమ్ మెంబర్ షిప్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ భయాందోళనలు కలిగిస్తుంటే.. మరోవైపు బెంగళూరులోని ఒక స్టార్టప్ కంపెనీ ప్రకటించిన జాబ్ ఆఫర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. కేవలం ఒక్క ఏడాది అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కు రూ.25 లక్షల బేస్ శాలరీ ఆఫర్ చేయడం ఇప్పుడు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. బెంగళూరు వేదికగా ఉన్న 'SDE 1' రోల్ కోసం కంపెనీ ఇస్తున్న ప్యాకేజీ వివరాలు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.

జీతం మాత్రమే కాదు.. కళ్లు చెదిరే బెనిఫిట్స్ 

ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి కేవలం జీతం మాత్రమే కాక.. ఇతర ప్రోత్సాహకాలు కూడా భారీగా ఉన్నాయి. బేస్ శాలరీ రూ.25 లక్షలతో పాటుగా.. 4 ఏళ్ల కాలపరిమితితో రూ.20 లక్షల విలువైన ఈసోప్స్ కూడా అందిస్తోంది కంపెనీ. వీటికి తోడు 10 శాతం పర్ఫార్మెన్స్ బోనస్, జాయినింగ్ అండ్ రీలోకేషన్ బోనస్ కింద మరో రూ.5 లక్షలు ఇస్తున్నారు. అంటే సదరు ఉద్యోగి మొదటి ఏడాది సంపాదన సుమారు రూ.35 లక్షలకు చేరుకుంటుంది.

ALSO READ : పండగ అవ్వగానే పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్..

ఇక పెర్క్స్ విషయానికొస్తే.. ఈ కంపెనీ సామాన్య మధ్యతరగతి కలలను మించి ఆఫర్ చేస్తోంది. ప్రతిరోజూ రూ.600 విలువైన జొమాటో క్రెడిట్స్, జిమ్ మెంబర్‌షిప్, మూడేళ్లకు ఒక కొత్త ఫోన్, వైఫై బిల్లుల రీయింబర్స్‌మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్ రూ.21వేలు ఆఫర్ చేస్తోంది భారీ జీతం ప్యాకేజీకి అదనంగా. దీన్ని చూస్తుంటే ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్లో ఇంత కంటే లగ్జరీ జాబ్ దొరుకుతుందా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ వినిపిస్తున్నాయి. 

ఈ పోస్ట్ లింక్డిన్, ఎక్స్‌లో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య పెద్ద చర్చ మొదలైంది. ఒకవైపు కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుంటే.. మరోవైపు జూనియర్లకు ఇంత భారీ ప్యాకేజీలు ఇవ్వడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలను నమ్ముకుని ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్ల కంటే.. కొత్తగా చేరే జూనియర్లకే ఎక్కువ జీతాలు ఇస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టెక్ పరిశ్రమలో శాలరీ స్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతిందని కొందరు సీనియర్లు ఏడుస్తున్నారు. 

ALSO READ : పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 

అయితే మార్కెట్లో డిమాండ్ ఉన్న టెక్నాలజీలో నైపుణ్యం సంపాదిస్తే ఇలాంటి భారీ ఆఫర్లు అందుకోవడం అసాధ్యమేమీ కాదంటున్నారు టెక్ నిపుణులు. అయితే పాత ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్ల కంటే కొత్తగా చేరే వారికి ఇచ్చే మార్కెట్ రేట్లు ఎక్కువగా ఉండటం ఐటీ రంగంలో పెరుగుతున్న అసమానతలకు అద్దం పడుతోందనే వాదన దీనిపై ప్రధానంగా వినిపిస్తోంది.