పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి యూపీఐతో పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా

 పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి యూపీఐతో పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా

న్యూఢిల్లీ:  ఉద్యోగులు ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచి తమ పీఎఫ్‌‌‌‌‌‌‌‌ డబ్బులను యూపీఐ ద్వారా ఈజీగా విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకోవచ్చు.  ఇందుకు సంబంధించిను కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌ను  ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓ)  తీసుకొచ్చింది. 

నాలుగు దశల్లో..

స్టెప్‌‌‌‌‌‌‌‌ 1: సభ్యుడు ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓ పోర్టల్‌‌‌‌‌‌‌‌లో విత్‌‌‌‌‌‌‌‌డ్రాయల్ రిక్వెస్ట్ పెట్టాలి. 
స్టెప్‌‌‌‌‌‌‌‌ 2: సిస్టమ్ అర్హత చెక్ చేసి, వెంటనే సభ్యుడికి విత్‌‌‌‌‌‌‌‌డ్రాయల్ అమౌంట్‌‌‌‌‌‌‌‌ను చూపిస్తుంది.
స్టెప్‌‌‌‌‌‌‌‌ 3: సభ్యుడు యూపీఐ పిన్‌‌‌‌‌‌‌‌ ద్వారా అథరైజేషన్ ఇవ్వాలి. ఇది రియల్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది.
స్టెప్‌‌‌‌‌‌‌‌ 4: అథరైజేషన్  పూర్తయిన తర్వాత, ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓ సిస్టమ్ ట్రాన్సాక్షన్‌‌‌‌‌‌‌‌ను ప్రాసెస్ చేస్తుంది. మూడు రోజుల్లో డబ్బు బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. ఇల్లు కట్టుకోవడానికి, సంతానం, పెళ్లిళ్లు చేయడానికి, వైద్యం వంటి అత్యవసర పరిస్థితుల కోసం పీఎఫ్​ డబ్బును తీసుకోవచ్చు. సభ్యులు తమ పీఎఫ్‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌లో 75శాతం వరకు తీసుకోవచ్చు.  కనీసం 25శాతం మొత్తం ఖాతాలో ఉండాలి. ఈ డబ్బుపై 8.25శాతం వడ్డీ చెల్లిస్తారు.