ఇవాళ(మార్చి 23) కేబినెట్లో 10 బిల్లుల ఆమోదం

 ఇవాళ(మార్చి 23) కేబినెట్లో 10 బిల్లుల ఆమోదం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌‌‌‌లో ఈ భేటీలో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.  

 ప్రధానంగా గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు డ్రాఫ్ట్, జీహెచ్‌‌‌‌ఎంసీ చట్టం స్థానంలో ‘కోర్ అర్బన్ యాక్ట్’ సంబంధిచిన డ్రాప్ట్​ బిల్లు, జీఎస్టీ సవరణ వంటి 10 బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది.  కేంద్రం తీసుకొచ్చిన సామాజిక భద్రత కోడ్ నేపథ్యంలో, “తెలంగాణ ప్లాట్‌‌‌‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు-2025” డ్రాప్ట్​పై ప్రభుత్వం ఇటీవల అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకుంది. ఈ బిల్లు చట్టమైతే అసంఘటిత రంగానికి చెందిన సుమారు 3 నుంచి 4 లక్షల మంది గిగ్ వర్కర్లను గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలను అందించనుంది.