
హోం వర్క్ ఎందుకు చేయలేదని టీచర్ కోప్పడగా స్కూల్ నుంచి పారిపోయాడు ఓ విద్యార్థి. ఈ ఘటన హైదరాబాద్ లోని బడంగ్ పేట్ దిల్ సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ లో జరిగింది. ఆనంద్ కుమార్ అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. అయితే టీచర్ హోం వర్క్ చేయలేదని కోపానికి వచ్చింది. దీంతో మనస్థాపానికి గురైన ఆనంద్ స్కూల్ నుంచి చెప్పకుండా వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పలేదు.
స్కూల్ అయిపోయినా ఆనంద్ ఇంటికి రాకపోవడంతో.. అతని తల్లిదండ్రులు స్కూల్ కు ఫోన్ చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ సమాదానాన్ని దాటవేస్తూ ఆనంద్ తండ్రితో నిర్లక్ష్యంగా మాట్లాడాడు. దీంతో పిలగాని కుటుంబ సభ్యులు మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.