గార్బా డ్యాన్స్ చేస్తూ..24 గంటల్లో 10 మంది మృతి

గార్బా డ్యాన్స్ చేస్తూ..24 గంటల్లో 10 మంది మృతి
  • గార్బా డ్యాన్స్ చేస్తూ..24 గంటల్లో 10 మంది మృతి
  • గుజరాత్‌లో నవరాత్రి వేడుకల్లో విషాదం

అహ్మదాబాద్: గుజరాత్‌లో జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గార్బా డ్యాన్స్ చేస్తూ.. 24 గంటల వ్యవధిలో 10 మంది చనిపోయారు. మృతుల్లో బరోడాకు చెందిన 13 ఏండ్ల బాలుడు, కాపడ్వాంజ్‌కు చెందిన బాలుడు (17), అహ్మదాబాద్‌కు చెందిన ఓ యువకుడు (24) కూడా ఉన్నారు. డ్యాన్స్ చేస్తుండగా వీరంతా కుప్పకూలారని, హార్ట్‌ ఎటాక్ వల్లే చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

నవరాత్రి ఉత్సవాలు మొదలైన తొలి ఆరు రోజుల్లో 108 సర్వీసులకు హార్ట్​ ఎటాక్​కు​ సంబంధించిన 521 కాల్స్‌ వచ్చాయని, శ్వాస ఆడటం లేదంటూ 609 ఫోన్స్ వచ్చాయని అధికారులు చెప్పారు. ఈ ఫోన్ కాల్స్ అన్నీ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు వచ్చాయని వివరించారు. గుజరాత్‌లోనే నవరాత్రి ఉత్సవాలకు ముందు గార్బా ప్రాక్టీస్ చేస్తూ ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.