జగిత్యాల వైద్యులు ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. జగిత్యాల రూరల్ మండలం గుల్లపేటకు చెందిన గరికంటి సత్తవ్వ(55) గత 6 నెలలుగా కడుపు ఆయాసంతో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా నయం కాకపోవడంతో.. ఆమె ఇవాళ జగిత్యాలలోని మహాదేవ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చింది. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా ఆమె కడుపులో 10 కిలోల కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైద్యులు సత్తవ్వకు 2 గంటలు శ్రమించి శస్త్ర చికిత్స చేసి కణితిని తొలగించారు. ఆపరేషన్ చేయడంతో ప్రాణాపాయం తప్పిందని డా.పురెళ్ళ సురేష్ తెలిపారు. ఇలాంటి శస్త్రచికిత్స చేసి 10 కిలోల కణితిని తొలగించడం మొదటిసారని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.
