ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో హెల్మెట్ల పంపిణీ

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో హెల్మెట్ల పంపిణీ

హైదరాబాద్​సిటీ,వెలుగు: రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం  ఖైరతాబాద్​ఆర్టీఏ ఆఫీసులో వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఆర్టీఏ హైదరాబాద్​కమిటీ సభ్యుడు ఎన్​.సురేశ్​లాల్​సర్వేజనా ఫౌండేషన్​తరపున ఈ హెల్మెట్ల పంపిణీ నిర్వహించారు. ఆర్టీఏ జాయింట్​కమిషనర్​రమేశ్​ పాల్గొన్నారు.