పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు..10 మంది మృతి

పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు..10 మంది మృతి

చెన్నై: తమిళనాడులోని ఓ పటాకుల ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలే ఉన్నారని అధికారులు వెల్లడించారు. విరుధ్ నగర్ జిల్లా వెంబకొట్టై సమీపంలో రాము దేవన్ పట్టీలోని పటాకుల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. 

పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న నాలుగు ఇండ్లు  కూడా ధ్వంసమయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఫ్యాక్టరీని విజయ్ అనే వ్యక్తి నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలోని కెమికల్ మిక్సింగ్ రూంలో మంటలు అంటుకోవడం వల్లే పేలుడు జరిగినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు.