మోహన్ బాబు ఇంట్లో చోరి.. 24 గంటల్లోనే దొంగని అరెస్ట్ చేసి రిమాండ్‪కు

మోహన్ బాబు ఇంట్లో చోరి..  24 గంటల్లోనే దొంగని అరెస్ట్ చేసి రిమాండ్‪కు

నటుడు మోహన్ బాబు ఇంట్లో బుధవారం చోరీ జరిగిన విషయం తెలిసిందే. చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు 24గంటల లోపే పట్టుకున్నారు. పోలీసులు వర్కర్ గణేష్ నాయక్ ను తిరుపతిలో అరెస్ట్ చేశారు. గణేష్ దగ్గర నుంచి రూ.10లక్షలు రికవరీ చేసి రిమాండ్ కు పంపారు. హ్యదరాబాద్ శివారులోని జల్ పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న నాయక్ చోరీకి పాల్పడ్డాడు. 10లక్షల రూపాయలతో పనిమనిషి పారిపోయినట్లు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మోహన్ బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుపతిలో పనిమనిషి నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు.

ALSO READ | ఇదేమి ఆనందం పవన్..! ప్రకాష్ రాజ్ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్

ప్రస్తుతం మోహన్ బాబు, మంచు విష్ణులు స్వీయ నిర్మాణంలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్స్ గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్లో 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా అయినా మంచు ఫ్యామిలీకి బ్లాక్ బస్టర్ అందుతుందేమో వేచి చూడాలి.