
కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎగువ అహోబిలం రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు
ఆళ్లగడ్డ నుంచి అహోబిలం క్షేత్రానికి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. తిరిగి వచ్చే క్రమంలో వెనక్కి తిప్పుతుండగా అదుపుతప్పి లోయలో పడింది. గాయపడిన వారిని బయటకు తీసి రెండు అంబులెన్సుల ద్వారా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు.