హైదరాబాద్లో 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

హైదరాబాద్లో 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

బషీర్​బాగ్, వెలుగు: అక్రమంగా నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల పీడీఎస్​బియ్యాన్ని ఖైరతాబాద్​పోలీసులు పట్టుకున్నారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ టీం, ఖైరతాబాద్‌ పోలీస్‌ బృందం బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు స్పెషల్​ డ్రైవ్‌ నిర్వహించాయి. అదే సమయంలో ఎండీ.అజార్‌ బైక్​పై అక్రమంగా పీడీఎస్​ బియ్యాన్ని తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు.

పీడీఎస్‌ లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని సేకరించి తన సహచరుడు అబ్దుల్‌ రెహమాన్‌ ఇంటికి తరలిస్తున్నట్లు విచారణలో అతను ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు బీజేఆర్‌ నగర్‌లోని రెహమాన్‌ ఇంటిపై దాడి చేసి, 10 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.