
గోవా, హర్యానా, ఢిల్లీ మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ట్యాక్స్ చెల్లించని 686 కేసుల మద్యాన్ని( పుల్ బాటిల్స్) అధికారులు హైదరాబాద్ లో పట్టుకున్నారు. అనంతరం వాటిని ధ్వంసం చేశారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ సమక్షంలో వివిధ స్టేషన్లో పట్టుకున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ 10 వేల 222 లీటర్ల మద్యాన్ని శనివారం అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. అన్నింటిని రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేయించారు. ధ్వంసం చేసిన మద్యం విలువ రూ.1.83 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.