ఆరూరి ప్రచారంలో అపశ్రుతి .. స్టేజ్ కూలి 10 మంది మహిళలకు గాయాలు

ఆరూరి ప్రచారంలో అపశ్రుతి ..  స్టేజ్ కూలి 10 మంది మహిళలకు గాయాలు

వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్  నిర్వహిస్తున్న ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో ఆరూరీ కోసం కార్యకర్తలు నిలబడి ఉన్న వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో పది మంది మహిళలు గాయపడ్డారు. వారికి వెంటనే స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం వరంగల్  గార్డియన్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. గాయపడిన వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.