- రాక్ అండ్ స్టార్మ్ డిస్టిలరీస్
హైదరాబాద్, వెలుగు: ఆల్కహాలిక్ బేవరేజెస్ రాక్ అండ్ స్టార్మ్ డిస్టిలరీస్ రాబోయే 3–-4 సంవత్సరాల్లో రూ.100 కోట్లతో తన వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఫలితంగా తమ ప్రొడక్షన్ కెపాసిటీ మరింత పెరుగుతుందని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ దాదాపు రూ. 400 కోట్ల టర్నోవర్ సాదించింది. 2021 చివరి క్వార్టర్లో రాష్ట్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి తెలంగాణలో గణనీయమైన వేగంతో అభివృద్ధి చెందామని తెలిపింది. ప్రస్తుతం ఇది బారెంట్స్ ప్రీమియం విస్కీ, రాయల్ ఏస్ విస్కీ, బిగ్ బాస్ బ్రాందీ ప్రొడక్టులను అమ్ముతోంది.
