పాక్ తో వార్ : హిట్ మ్యాన్ సెంచరీ

పాక్ తో వార్ : హిట్ మ్యాన్ సెంచరీ

పాక్ తో ఫస్ట్ నుంచి దూకుడుగా ఆడిన టీమిండియా అదే జోరును కంటిన్యూ చేస్తుంది. ఆడాలన్న కసి…. తప్పక గెలవాలన్న తాప్రత్రయం… ఇవాళ్టీ మ్యాచ్ లోని ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ లో ఆ ఆరటం కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ….. కెరీర్ లో మరో సెంచరీ చేశాడు. ఫోర్ తో స్కోర్క్ ను ప్రారంభించిన రోహిత్…. తొమ్మిది ఫోర్లు… మూడు సిక్సులతో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఈ సీజన్ వాల్డ్ కప్ లో రెండో సెంచరీ చేశాడు రోహిత్.  సౌతాఫ్రికాపై ఫస్ట్ సెంచరీ చేసిన రోహిత్… పాకిస్తాన్ పై రెండో సెంచరీ చేశాడు. దీంతో  వన్డే కెరీర్ లో 24వ సెంచరీ కంప్లీట్ చేశాడు రోహిత్ శర్మ.

శిఖర్ ధవన్ స్థానంలో ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ పూర్తి చేసిన కాసేపటికే ఔట్ అయ్యాడు. రియాజ్ బౌలింగ్ లో బాబర్ అజంకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 78 బాల్స్ లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 57 పరుగులు చేశాడు రాహుల్.

ఫస్ట్ నుంచి పాక్ బౌలర్లపై విచురుకు పడుతున్నాడు రోహిత్. అయితే రోహిత్ దూకుడుకు పాకిస్తాన్ ఏకంగా 23 ఓవర్లకే ఏడు మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. రాహుల్ ఔట్ తో ఫస్ట్ డౌన్ లో క్రిజులోకి దిగిన కెప్టెన్ కోహ్లీ….కూల్ గా ఆడుతున్నాడు.

32 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 187 రన్స్ చేసింది భారత్. రోహిత్(104), కోహ్లీ(20) రన్స్ తో క్రీజులో ఉన్నారు.