
ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని జంగ్పురా జగిరిన సంచలనాత్మక నగల దుకాణం చోరీ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇటీవల చోరీకి పాల్పడిన దొంగ లోకేష్ శ్రీవాస్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఛత్తీస్ గఢ్ కు చెందిన లోకేశ్ శ్రీవాస్ ఒక్కడే ఈ చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ చరిత్రలో ఇది అతిపెద్ద నగల దోపిడీ. 25 కోట్ల రూపాయల నగల దోపిడీకి దొంగ లోకేష్ ఉపయోగించిన పరికరాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సెప్టెంబర్ 26న ఢిల్లీ చరిత్రలో అతి పెద్ద చోరీ.. జంగ్ పురా నగల షాపులో జరిగింది. రూ. 25 కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లారు దొంగలు.. ఇంత పెద్ద చోరీని పక్కా ప్లాన్ తో దొంగతనంలో ఎక్స్ పర్ట్ అయిన దొంగల ముఠా చేసిందనుకున్నారు పోలీసులు.. కానీ ఇటీవల చోరీ చేసిన దొంగను అరెస్ట్ చేసి విచారిస్తే.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..
ఇంత పెద్ద చోరీ చేసింది ఒక్కడే.. ఛత్తీస్గఢ్ కు చెందిన లోకేష్ శ్రీవాస్.. ఇతడు ఆరితేరిన దొంగ.. ఒక్కడే దొంగతనాలకు పాల్పడుతుంటాడని పోలీసులు విచారణలో తేలింది. రెండు రోజుల పాటు జువెల్లరీ షాపు ముందు రెక్కీ నిర్వహించిన లోకేష్.. దొంగతనం కోసం ఉపయోగించిన సాధనాలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించారు. చాందినీ చౌక్ నుంచి 100రూపాయలకు సుత్తి GB రోడ్ నుంచి 13 వందల రూపాయల విలువైన డిస్క్ కట్టర్ కొనుగోలు చేశారు. ఇంటి నుంచి స్క్రూడ్రైవర్లు, శ్రావణం తెచ్చాడు. వీటి కొనుగోలుకు సబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పక్కనే ఉన్న భవనంపై నుంచి భోగల్ ప్రాంతంలోని ఉమ్రావ్ జ్యువెలర్స్‌లోకి చొరబడ్డాడు. రాత్రంతా అక్కడే ఉంచి స్ట్రాంగ్ రూంలో ఉంచిన నగలను దొంగిలించాడు. CCTV కెమెరాలను డిస్‌కనెక్ట్ చేయడం, స్ట్రాంగ్‌రూమ్‌ను పగలగొట్టిన తీరు ఢిల్లీ పోలీసులనే అశ్చర్యపర్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగ నాలుగు అంతస్తుల భవనంలోకి టెర్రస్‌పై నుంచి ప్రవేశించి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న స్ట్రాంగ్‌రూమ్ ఉంది. అతను స్ట్రాంగ్‌రూమ్ గోడకు రంధ్రం వేయడానికి డ్రిల్‌ను ఉపయోగించాడు. లోపల ఉన్న ఆభరణాలను, షోరూమ్‌లో ఉంచిన నగలను కూడా దొంగిలించాడు.
శుక్రవారం ఉదయం లోకేశ్‌ను అరెస్టు చేయగా.. ప్రస్తుతం బిలాస్‌పూర్ పోలీసుల కస్టడీలో ఉన్నారు.