హైదరాబాద్ : కూలిన వందేండ్ల భవనం

హైదరాబాద్ : కూలిన వందేండ్ల భవనం

బషీర్​బాగ్, వెలుగు: భారీ వర్షాలతో బేగంబజార్ సంతోషిమాత దేవాలయం సమీపంలో వందేళ్ల పురాతన భవనం గురువారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఇందులో గత 20 ఏండ్లుగా ఎవరూ నివాసం ఉండడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. జీహెచ్​ఎంసీ అధికారులు జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించారు. మరోవైపు గోషామహల్ నియోజవర్గంలోని పురాతన భవనాల్లో పలువురు వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.  వెంటనే ఆ దుకాణాలను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులు వారికి విజ్ఞప్తి చేశారు. ఒకటి రెండు రోజుల్లో నోటీసులు కూడా పంపిస్తామన్నారు.