పుష్ప2 కోసం రూ.1000 కోట్ల ఆఫర్?.. ఇది నెక్స్ట్ లెవల్ క్రేజ్

పుష్ప2 కోసం రూ.1000 కోట్ల ఆఫర్?.. ఇది నెక్స్ట్ లెవల్ క్రేజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa the rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పుష్ప2(Pushpa2) ఉండేలా జాగ్రత్తపడుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే పుష్ప 2 గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

తాజాగా సమాచాం ప్రకారం.. పుష్ప 2 సినిమా కు ఏకంగా రూ.1000 కోట్ల ఆఫర్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ హక్కుల కోసం ఇంత భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సౌత్ సినీ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. సౌత్ ఇండస్ట్రీల్లో ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ లో ఆఫర్ రాలేదు. ఈ ఒక్క న్యూస్ తో దేశవ్యాప్తంగా పుష్ప2 సినిమాపై క్రేజ్ ఎలా ఉందొ అర్థమవుతోంది. ఇక ఇటీవల అల్లు అర్జున కు నేషనల్ అవార్డు రావడం కూడా ఇందుకు కారణం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. రేంజ్ అంటే ఐకాన్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ALSO READ :అలాంటి వారికి ఇలానే బుద్ది చెప్పాలి.. కృతి ఎమోషనల్ కామెంట్స్

ఇక పుష్ప2 విషయానికి వస్తే.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రిలీజ్ కు ముందే ఈ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. విడుదల తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.