
ధర్మపురి: స్టాలిన్ సర్కార్ తమిళనాడులో మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి అందజేయనుంది. మంత్లీ బేసిక్ ఇన్కమ్ స్కీమ్రిజిస్ర్టేషన్క్యాంప్ను సోమవారం సీఎం స్టాలిన్ధర్మపురి సిటీలో ప్రారంభించారు. అధికార డీఎంకే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని సెప్టెంబర్నుంచి అమలుచేయనున్నారు. ఈ సందర్భంగా బయోమెట్రిక్ రిజిస్ర్టేషన్ ప్రక్రియను స్టాలిన్ స్వయంగా పర్యవేక్షించారు. ధర్మపురి జిల్లాలో తొలిదశ స్పెషల్ క్యాంప్ ఈ నెల 24నుంచి ఆగస్టు 4వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 2,21,484 రేషన్‌కార్డ్ హోల్డర్స్ లబ్ధి పొందనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, రెండో దశ క్యాంప్‌ను ఆగస్టు 5 నుంచి 16వరకు నిర్వహించనున్నామని, రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కోసం 35,923 క్యాంప్‌లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు.