
హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 17న రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 1,01,116 మొక్కలు నాటనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన ప్రణాళిక రూపొదించామన్నారు. మొక్కలు నాటడమే కాకుండా టీచర్ల పర్యవేక్షణలో వాటి సంరక్షణ బాధ్యతలు కూడా స్వీకరించనున్నట్లు చెప్పారు.