ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌.. ఒక్క‌రోజే ప‌దివేల‌కు పైగా కేసులు

ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌.. ఒక్క‌రోజే ప‌దివేల‌కు పైగా కేసులు

ఏపీలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,45,216కి పెరిగింది. ఇందులో 89,389 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,52,638 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజాగా వైరస్ కారణంగా 97 మంది మరణించగా.. రాష్ట్రంలో మృతుల సంఖ్య 3189కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో చిత్తూరులో 13, అనంతపురం 11, నెల్లూరు 10, తూర్పుగోదావరి 8, కడప 8, పశ్చిమ గోదావరి 8, ప్రకాశం 8, కర్నూలు 8, గుంటూరు 6, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 5, కృష్ణా 3, విజయనగరం 3 మంది చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.