ఏపీలో కొత్తగా 10,373 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 10,373 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 88,441 కరోనా పరీక్షలు నిర్వహించగా 10,373 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,880 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1,728 కేసులు, అనంతపురం జిల్లాలో 1,002 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 309 పాజిటివ్ కేసులు గుర్తించారు.

15,958 మంది కరోనా నుంచి కోలుకోగా, 80 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17,49,363 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 16,09,879 మంది కోలుకున్నారు. ఇంకా 1,28,108 మందికి చికిత్స కొనసాగుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 11,376కి పెరిగింది.