
కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. చాప కింద నీరులా చల్లగా పాకేస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది.. దేశ రాజధానిలోనే వందకు చేరింది. భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నది.
దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా కేసులు.. ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీలో వైరస్ బాధితులు వంద కేసులు బయటపడ్డాయని.. వీళ్లందరినీ ఇంట్లోనే క్వారంటైన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా డేటా పరిశీలిస్తే.. కేరళలో 430 కేసులతో టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. 209 యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో నమొదయ్యాయి. 100 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉండగా.. గుజరాత్ లో 83, కర్ణాటకలో 47 కేసులు, ఉత్తరప్రదేశ్ లో 15, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 12 కేసులు బయటపడ్డాయి.
ఇప్పటి వరకు దేశంలో కరోనాతో నలుగురు చనిపోయారు. మహారాష్ట్రలో ఒకరు, కేరళలో ఇద్దరు,, కర్ణాటకలో ఒకరు కోవిడ్ వైరస్ ఎటాక్ అయ్యి చనిపోయారు.
అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లించింది.
గతంలో దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు వేయటం వల్లనే ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువగా ఉందని.. అనారోగ్యంతో ఉన్న వాళ్లకే ఇప్పుడు కరోనా ఎటాక్ అవుతుందని.. పెద్దగా ప్రభావం చూపించటం లేదని.. జనం భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్య శాఖ స్పష్టం చేస్తోంది.