
హైదరాబాద్: ఆ బాలుడు చదువుతున్నది టెన్త్ క్లాస్. విద్యా బుద్ధులు నేర్చుకోవాల్సిన పిల్లోడు తప్పుడు పని చేశాడు. తల్లి వయసున్న మహిళ స్నానం చేస్తుండగా మొబైల్ లో వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను ఫ్రెండ్స్ కు షేర్ చేశాడు. దీంతో ఆ వీడియోను చూసిన పక్కింటి మహిళ ..ఈ వీడియోలో ఉన్న మహిళను గుర్తు పట్టింది. అసలు విషయాన్ని ఆమెకు చెప్పడంతో..ఒక్కసారిగా షాక్ అయ్యింది. తాను స్నానం చేస్తుండగా ఓ బాలుడు ఈ వీడియో తీశాడని గుర్తించింది.
ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. పోలీసులు బాలుడి కోసం వెళ్తే ఆ బాలుడు 10 వ తరగతి పరీక్ష రాయడానికి వెళ్లాడని తెలిసింది. ఆ బాలుడి పై పోలీసులు FIR కూడా ఫైల్ చేశారు. ఈ కేసును ఛత్రినాక పోలీసుల నుంచి సైబర్ క్రైమ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ అయింది. ఉన్నతాధికారులు వచ్చి 10వ తరగతి ఎగ్జామ్స్ అయ్యాక బాలుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామి ఇచ్చారు. అయితే మహిళ పరువుకు సంబంధించిన విషయం కావడంతో వివరాలు సీక్రెట్ గా ఉంచారు పోలీసులు.