కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్.. విజయ్ మదర్ ఎమోషనల్.. అసలు ఏం జరిగిందంటే..

కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్.. విజయ్ మదర్ ఎమోషనల్.. అసలు ఏం జరిగిందంటే..

విజయ్ దేవరకొండ సరైన హిట్ కొట్టి చాన్నాళ్లయింది. సరైన కమ్ బ్యాక్ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఈ యువ హీరో ‘కింగ్ డమ్’ సినిమాతో జులై 31న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ.. ఇది విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కాదని, ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కింగ్ డమ్ అని, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కింగ్ డమ్ అని చెప్పాడు. ఈరోజు ఫ్యాన్ మీట్లో 2 వేల మంది అభిమానులను కలిశానని, నీకు హిట్ పడాలని అనడం లేదని.. మనం హిట్ కొడుతున్నామని అంటున్నారని విజయ్ తెలిపాడు.

మనం అనే పదం OWN చేసుకుంటేనే వస్తుందని అభిమానుల ప్రేమకు విజయ్ ఫిదా అయ్యాడు. ఎవరో కుంభమేళాకు వెళ్ళి తన పోస్టర్తో మునిగి.. తాను హిట్ కొట్టాలని కోరుకున్నాడని, హిట్ కొట్టిన తర్వాత కచ్చితంగా అతనిని కలుస్తానని విజయ్ మాటిచ్చాడు. అభిమానుల కోసం తాను రెండు పనులు చేయాలని ఫిక్స్ అయ్యానని, ఒకటి సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేయాలని, రెండోది తాను ఉన్నంత వరకు మీ లైఫ్లో ఏదైనా మంచి చేసే వెళ్ళాలని అక్కడికి వచ్చిన అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడాడు.

Kingdom Trailer వచ్చాక చాలా మంచి స్పందన వచ్చిందని.. ఈ ట్రైలర్ చూసి బాగుందని కామెంట్ చేసిన వాళ్ల DPలు చూస్తే.. Superstar... Icon Star..Tiger.. అని ఉన్నాయని విజయ్ చెప్పాడు. మీ అందరినీ కలవలేకపోవచ్చు కానీ.. మీ అందరికీ ఏదొక Positive Contribution చేసే పోతానని విజయ్ చెప్పడం విశేషం. ఇంకా.. ఈ ఈవెంట్ లో హైలైట్స్ ఏంటంటే.. విజయ్ దేవరకొండ జర్నీకి సంబంధించిన AV చూసి విజయ్ అమ్మ ఎమోషనల్ అయ్యారు.

►ALSO READ | అవతార్-3 ట్రైలర్ రివ్యూ.. Avatar: Fire and Ash ట్రైలర్ బానే ఉంది.. కానీ..

అనిరుధ్ మాట్లాడుతూ.. తనను తెలుగు ప్రజలు తమ వాడిని చేసుకున్నారని, తాను ఎప్పటికీ మీ అనిరుధ్నేనని.. మీ బక్కోడినేనని అని అనిరుధ్ చెప్పడంతో అక్కడున్న వాళ్ల ముఖాల్లో నవ్వులు విరబూశాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కింగ్ డమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రాలేదు. గౌతమ్ ఈ సినిమాకు సంబంధించిన వర్క్లోనే బిజీగా ఉన్నాడని విజయ్ దేవరకొండ చెప్పాడు. జులై 31న విడుదల కాబోతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఫస్ట్ డే బుకింగ్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ కనిపించింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్లను రాబట్టడం ఖాయం.