నాగర్కర్నూల్, కల్వకుర్తి మున్సిపాలి టీల్లో క్యాంప్ నకు కాంగ్రెస్ కౌన్సిలర్లు

నాగర్కర్నూల్, కల్వకుర్తి మున్సిపాలి టీల్లో క్యాంప్ నకు కాంగ్రెస్ కౌన్సిలర్లు

నాగర్​కర్నూల్, వెలుగు :  మున్సిపల్​ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం నాగర్​కర్నూల్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో  కాంగ్రెస్​ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చిన తర్వాత కూడా ఎందుకైనా మంచిదని మందు జాగ్రత్తగా గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్​లోని రిసార్టులకు తరలించారు. నాగర్​ కర్నూల్​ మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులు18 స్థానాల్లో  గెలుపొందారు. 

బీఆర్​ఎస్​ అభ్యర్థులు ఆరు స్థానాలకు పరిమితమయ్యారు. బీసీ జనరల్​కు రిజర్వ్​ చేసిన మున్సిపల్​ చైర్​పర్సన్​ పదవికి ఇద్దరు పోటీపడగా రెండవ వార్డు నుంచి పోటీ చేసిన పొడుగు శ్రీనివాసులు ఓటమి పాలయ్యారు. తీగల సునేంద్ర గెలుపొందారు. చైర్​పర్సన్​ పదవి ఆయనకే దక్కుతుందన్న ప్రచారం జరుగుతున్నా చివరిలో ఏదైనా జరగొచ్చని సునేంద్ర మద్దతుదారులు అంటున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను కాంగ్రెస్​ అభ్యర్థులు13 వార్డులలో గెలుపొందారు. 

జనరల్​ మహిళకు రిజర్వ్​ అయిన చైర్​పర్సన్​ పదవిని ఎన్నికలకు బృంగి రత్నమాలకు ఇస్తామని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ప్రకటించారు.  జనరల్​మహిళకు రిజర్వ్​ చేసిన స్థానంలో బీసీ మహిళకు ఎందుకివ్వాలన్న చర్చ పార్టీలోని ఒక వర్గం స్టార్ట్​ చేసినట్లు సమాచారం. కొల్లాపూర్​ మున్సిపాలిటీ చైర్​ పర్సన్​ బీసీ మహిళకు రిజర్వ్​ చేశారు. 19 వార్డులకు గాను  కాంగ్రెస్​ పార్టీ నుంచి 16 మంది అభ్యర్థులు గెలుపొందారు. చైర్​పర్సన్​పోస్టుకు దాదాపు ఆరుగురు పోటీపడుతుండగా వారిలో మేకల రమ్య, వంగ అనూష, శ్రీదేవి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా, మంత్రి జూపల్లి ఎవరిని ఫైనల్​ చేస్తారో అనే ఉత్కంఠ ఏర్పడింది.