అవతార్-3 ట్రైలర్ రివ్యూ.. Avatar: Fire and Ash ట్రైలర్ బానే ఉంది.. కానీ..

అవతార్-3 ట్రైలర్ రివ్యూ.. Avatar: Fire and Ash ట్రైలర్ బానే ఉంది.. కానీ..

హాలీవుడ్ సినిమాల్లో ‘అవతార్’ ఫ్రాంచైజ్కు ఉన్న క్రేజే వేరు. 2009లోనే విజువల్ వండర్గా అద్భుతాలు సృష్టించిన ‘అవతార్’ సినిమా ఫ్రాంచైజీలో భాగంగా 2025 డిసెంబర్లో అవతార్3 థియేటర్లలో సందడి చేయనుంది. నాలుగు నెలల ముందే అవతార్-3 ట్రైలర్ వచ్చేసింది. ‘అవతార్‌‌‌‌: ఫైర్‌‌‌‌ అండ్ యాష్‌‌’ పేరుతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్.. అవతార్3 సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఇచ్చింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే.. కథ మాత్రం రెండు భాగాల్లో చూపించినట్టుగానే మూడో భాగం కూడా పోరాటమే ప్రధానాంశంగా సాగుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

విజువల్స్ కొత్తగా ఉన్నాయి గానీ కథాంశం మాత్రం మారినట్టుగా అనిపించడం లేదు. అయితే.. ఒక్క ట్రైలర్ చూసి మాత్రమే సినిమా ఫలితంపై ఒక అంచనాకు రావడం సమంజసం కాదు. ట్రైలర్ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. కథాంశం ఒక్కటే కొత్తగా లేదు. అయితే.. రెండో భాగంతో పోల్చితే మూడో భాగం విజువల్స్ అదరగొడతాయని ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది.

ట్రైలర్ రివ్యూ ఏంటని ఒక్కమాటలో అడిగితే మాత్రం.. ‘‘బాగుందన్నా.. నిజంగా బాగుందన్నా అంటే’’.. అని చెప్పేయొచ్చు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆవిష్కరించిన అద్భుత దృశ్య కావ్యం Avatar: Fire and Ash. డిసెంబర్ 19, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

►ALSO READ | Vijay Deverakonda: 'కింగ్‌డమ్'‌కు ప్రీమియర్ షో కష్టాలు? ప్రభుత్వ నిర్ణయంపై డైలమా!

మొదటి భాగంలో పండోర గ్రహంలోని ప్రకృతి అందాలను, ఆ పండోరా గ్రహంలో జరిగిన విధ్వంసాన్ని చూపించిన కామెరూన్.. ‘అవతార్: ది వే ఆఫ్‌‌ వాటర్‌‌‌‌’ పేరుతో రెండో భాగం మొత్తం నీటిపై నడిపించాడు. ఇప్పుడు మూడో భాగం మొత్తం భగభగలాడే అగ్ని నేపథ్యంలో సాగనుంది. 2029లో ‘అవతార్‌‌‌‌ 4’ , 2031లో ‘అవతార్‌‌‌‌ 5’ విడుదల కానుండటం గమనార్హం.