
వైసీపీ అధినేత జగన్ సతీసమేతంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు. సోమవారం ( జులై 28 ) ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు జగన్ దంపతులు. ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకున్న అయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు జగన్. ఏపీలో వైసీపీ నేతలపై లిక్కర్ స్కాం వంటి వరుస కేసులు నమోదవుతున్న వేళ గవర్నర్ తో జగన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే.. గవర్నర్ తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని... మర్యాదపూర్వకంగానే జగన్ గవర్నర్ తో భేటీ అయ్యారని అంటున్నారు వైసీపీ శ్రేణులు.ఇదిలా ఉండగా.. గవర్నర్ తో భేటీలో ఏపీ లిక్కర్ స్కాం, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగిందని టాక్ వినిపిస్తోంది.
అంతే కాకుండా ఆదివారం ( జులై 27 ) హైదరాబాద్ లోని భారతి సిమెంట్స్ ఆఫీసులో సిట్ అధికారుల సోదాలు నిర్వహించిన క్రమంలో ఈ భేటీపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరి, జగన్ మర్యాదపూర్వకంగానే గవర్నర్ ని కలిశారా.. లేక ఈ భేటీ వెనక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అన్నది వేచి చూడాలి.