
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో.. హైదరాబాద్ సిటీలో వర్షాలకు బ్రేక్ పడింది. వారం రోజులుగా ముసురుతో ఇబ్బంది పడిన జనం.. ఎండ రావటంతో రిలాక్స్ అయ్యారు. ఇదే విధమైన వాతావరణం మరో వారం రోజులు ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 2025, ఆగస్ట్ 3వ తేదీ వరకు వర్షాలు లేవని.. పడినా చెదురు మదురు, జల్లుల వర్షమే ఉంటుందని.. ఆగస్ట్ 3వ తేదీ వరకు భారీ వర్షాలు ఉండవని వెల్లడించింది. దీంతో వారం రోజులుగా ముసురు వానలతో ఇబ్బంది పడిన జనం.. రిలాక్స్ అయ్యారు.
రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా కురిసిన వర్షాలు రానున్న వారం పాటు బ్రేక్ ఇస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వచ్చే వారం రోజుల పాటు అంటే 2025, ఆగస్ట్ 3వ తేదీ వరకుతెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. భారీ వర్షాలు మాత్రం పడవని చెప్పింది. ఐఎండీతో పాటు ఇతర వాతావరణ నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
వచ్చే వారం రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడవని.. హైదరాబాద్‌తో సహా మొత్తం తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుందని అంచనా వేశారు. ఐఎండీ అంచనాతో హైదరాబాద్ వాసులకు కాస్తా ఊపిరి పీల్చుకుంటున్నారు. గత వారం రోజులుగా కురుస్తోన్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల పనులు, ఉద్యోగాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా మారింది. వర్షం కురవడంతో వరద నీరు రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.