ఏడేళ్లుగా సహజీవనం చేస్తూ యువకుడు నిరాకరించడంతో.. సూర్యాపేట జిల్లాలో యువతి ఆత్మహత్యా యత్నం

ఏడేళ్లుగా సహజీవనం చేస్తూ యువకుడు నిరాకరించడంతో.. సూర్యాపేట జిల్లాలో యువతి ఆత్మహత్యా యత్నం

సూర్యాపేట జిల్లాలో మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనంగా మారింది.  గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తూ ఇటీవల యువకుడు నిరాకరించడంతో మహిళ సూసైడ్ అటెంప్ట్ చేసింది.  ఇంట్లోకి తీసుకువెళ్లడానికి నిరాకరించడంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. 

వివరాల్లోకి వెళ్తే.. కోదాడ మున్సిపాలిటీ కోమరబండలో యువకుడి ఇంటిముందు పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గత రెండు రోజులుగా యువకుడి మహేష్ ఇంటి ముందు  ధర్నా చేస్తున్న యువతి.. ఆత్మహత్యకు ప్రయత్నించింది. తనను మహేష్ మోసం చేశాడు అంటూ యువకుడి ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

►ALSO READ హైదరాబాద్ కుషాయిగూడలో మిస్సింగ్.. దుర్గం చెరువులో డెడ్ బాడీ

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీస్ సిబ్బంది.. యువతిని బలవంతంగా బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  వైద్య చికిత్స అందించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.