Gold Rate: శ్రావణ సోమవారం నాడు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..? తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

Gold Rate: శ్రావణ సోమవారం నాడు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..? తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

Gold Price Today: ఈరోజు శ్రావణ సోమవారం. చాలా మంది దీనిని శుభప్రదమైనదిగా భావిస్తుంటారు. పైగా పెళ్లిళ్ల సీజన్ కూడా స్టార్ట్ అవుతున్న వేళ బంగారం, వెండి ఆభరణాలకు మంచి రోజుగా తెలుగు ప్రజలు ఇష్టపడుతుంటారు. గతవారం చివరిలో వరుసగా తగ్గిన తర్వాత పసిడి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగటంతో చాలా మంది షాపింగ్ చేయాలని చూస్తున్నారు. అయితే దీనికి ముందు రిటైల్ మార్కెట్లో ధరలను పరిశీలించటం ముఖ్యం. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ రేట్లను పరిశీలిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.9వేల 160, ముంబైలో రూ.9వేల 160, దిల్లీలో రూ.9వేల 175, కలకత్తాలో రూ.9వేల 160, బెంగళూరులో రూ.9వేల 160, కేరళలో రూ.9వేల 160, పూణేలో రూ.9వేల 160, వడోదరలో రూ.9వేల 165, జైపూరులో రూ.9వేల 175, మంగళూరులో రూ.9వేల 160, నాశిక్ లో రూ.9వేల 163, అయోధ్యలో రూ.9వేల 175, గురుగ్రాములో రూ.9వేల 175, బళ్లారిలో రూ.9వేల 160, నోయిడాలో రూ.9వేల 175 వద్ద నేడు కొనసాగుతున్నాయి.

ALSO READ : IT News: టెక్కీల లేఆఫ్స్‌కి AI కారణం కాదు.. అసలు మ్యాటర్ చెప్పిన TCS సీఈవో..

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు కూడా నిన్నటితో పోల్చితే ఎలాంటి మార్పు లేకుండా ఉన్నాయి.  దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.9వేల 993, ముంబైలో రూ.9వేల 993, దిల్లీలో రూ.10వేల 008, కలకత్తాలో రూ.9వేల 993, బెంగళూరులో రూ.9వేల 993, కేరళలో రూ.9వేల 993, పూణేలో రూ.9వేల 993, వడోదరలో రూ.9వేల 998, జైపూరులో రూ.10వేల 008, మంగళూరులో రూ.9వేల 993, నాశిక్ లో రూ.9వేల 996, అయోధ్యలో రూ.10వేల 008, గురుగ్రాములో రూ.10వేల 008, బళ్లారిలో రూ.9వేల 993, నోయిడాలో రూ.10వేల 008గా ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 600 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులం రూ.99వేల 930గాఉన్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 26వేల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.