నిమ్స్ డిప్యూటీ సూపరిడెంట్ లక్ష్మీ భాస్కర్పై కేసు నమోదు

నిమ్స్ డిప్యూటీ సూపరిడెంట్ లక్ష్మీ భాస్కర్పై కేసు నమోదు

హైదరాబాద్: నిమ్స్ డిప్యూటీ సూపరిడెంట్ లక్ష్మీ భాస్కర్పై కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన మరో వైద్యుడిని స్థలం వివాదంలో లక్ష్మీ భాస్కర్ మోసం చేశాడనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. స్థలం పేరుతో నిమ్స్ డిప్యూటీ సూపరిడెంట్ బాధితుడి నుంచి 50 లక్షలు కాజేసినట్లు తెలిసింది. కోర్టు సిఫారసుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

లక్ష్మీ భాస్కర్పై గతంలోనూ ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. తనకి గత ప్రభుత్వ రాజకీయ పలుకుబడి ఉందని బాధితుడిని లక్ష్మీ భాస్కర్ బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. లక్ష్మీ భాస్కర్కు సహకరించిన మరికొందరి పైన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

►ALSO READ | హైదరాబాద్లో చిరుత కలకలం.. ఆ ఏరియా వాళ్లు జాగ్రత్త !

కరోనా సమయంలోనూ లక్ష్మీ భాస్కర్ పై కొన్ని ఆరోపణలు రావడం గమనార్హం. కోవిడ్ బెడ్స్ను బ్లాక్లో అమ్ముకుని దందాకు తెరలేపాడని డిప్యూటీ సూపరిడెంట్ లక్ష్మీ భాస్కర్పై ఆరోపణలొచ్చాయి. కోవిడ్ రోగులు బెడ్స్ను బ్లాక్లో అమ్ముకున్నాడని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లక్ష్మీ భాస్కర్పై అప్పట్లో కేసు కూడా నమోదైంది. దళారులను పెట్టి బ్లాక్లో కోవిడ్ బెడ్స్ దందా సాగించాడనేది లక్ష్మీ భాస్కర్పై ప్రధాన ఆరోపణ.