హైదరాబాద్ టూ విజయవాడ రూట్ బస్ టికెట్లపై భారీ తగ్గింపు

హైదరాబాద్ టూ విజయవాడ రూట్ బస్ టికెట్లపై భారీ తగ్గింపు

హైదరాబాద్: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్లో నడిచే బస్సుల్లో టికెట్ ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది.

ఈ రూట్లో నడిచే గరుడ బస్ టికెట్ ధరలపై 30 శాతం, ఈ-గరుడ బస్ టికెట్ ధరలపై 26 శాతం, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్ టికెట్లపై 20 శాతం, రాజధాని, లహరి ఏసీ బస్ టికెట్ ధరలపై 16 శాతం తగ్గింపును టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించడం విశేషం.

దూర ప్రయాణంపై టికెట్ ధరలపై రాయితీ ప్రకటించిన టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ సిటీలో మాత్రం జూన్లో బస్ పాస్ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్​పరిధిలో బస్​పాస్​రేట్లు గత నెలలో పెరిగాయి. ఆర్డినరీ పాస్లపై 23 శాతం, స్టూడెంట్​బస్ పాస్లపై 50 శాతం రేట్లు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దీంతో నెలవారీ బస్​పాస్లతో ప్రయాణించే వారిపై ఆర్థికభారం పడనుంది.

స్టూడెంట్ బస్​పాస్ రేట్లను గత మూడేండ్లుగా పెంచలేదని, సంస్థపై పెరిగిన ఖర్చుల భారం నుంచి కొంత ఊరట పొందడానికే చార్జీలను పెంచినట్టు అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి స్టూడెంట్స్​ మెట్రో ఎక్స్​ప్రెస్లలో కూడా ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.

►ALSO READ | నిమ్స్ డిప్యూటీ సూపరిడెంట్ లక్ష్మీ భాస్కర్పై కేసు నమోదు

అలాగే టోల్ ​ప్లాజా యూజర్ ​చార్జీలను కూడా సవరించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టోల్​ ప్లాజా మీదుగా వెళ్లే ప్రతి ప్రయాణికుడి నుంచి అదనంగా ప్లాజాకు రూ.10 వసూలు చేస్తామన్నారు. టోల్​ ప్లాజా మీదుగా ప్రయాణించక పోతే యూజర్​ చార్జీలు ఉండవని వివరణ ఇచ్చారు.