
మత్తు పదార్థాల స్మగ్లింగ్, అమ్మకాల్లో కొందరి ప్లాన్లు పోలీసులనే ఆశ్చర్యపరిచేలా ఉంటున్నాయి. గంజాయిని పొట్లాలు, ప్యాకెట్లు, చాక్లెట్ల రూపంలో అమ్మితే దొరికిపోతున్నామని భలే ప్లాన్ వేశారు నిర్మల్ జిల్లా యువకులు. డౌట్ రాకుండా గంజాయి ఇంజెక్షన్లను తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంజెక్షన్ల రూపంలో గంజాయి అమ్ముతున్న నలుగురు యువకులను సోమవారం (జులై 28) పోలీసులు అరెస్టు చేశారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో నలుగురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయిని లిక్విడ్ రూపంలోకి మార్చి ఇంజెక్షన్లతో అమ్ముతున్నారు. నిందితులన నుంచి వంద గ్రాముల గంజాయి, మూడు మత్తు మందు ఇంజక్షన్లు, మూడు సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు .అలాగే ఒక అటో, నాలుగు మొబైల్ పోన్లను స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
►ALSO READ | మధ్యాహ్నం కూడా ఇంట్లోనే ఉన్న ఈ యువతి అలా ఎలా చనిపోయిందో పాపం..
ఇప్పటి వరకు గంజాయిని చాక్లెట్ల రూపంలో, ప్రత్యేక ప్యాకేజ్ లో ముడి పదార్థంగా అమ్మిన స్మగ్లర్లు ఏకంగా గంజాయి ఇంజక్షన్లనే తయారు చేస్తుండటంతో ఆందోళన కలిగించే అంశం. మాదక ద్రవ్యాల సరఫాపై ఉక్కుపాదం మోపిన పలీసులు.. ఎక్కడికక్కడ దాడులు చేస్తూ దుండగులను అరెస్టు చేస్తున్నారు. అయినా గంజాయి వ్యాపారం యధేచ్చగా సాగుతోంది. నిర్మాల్ జిల్లాలో ఇంజక్షన్ల రూపంలో గంజాయి అమ్మకాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీని వెనుక ఉన్న ముఠాను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.