మీ కంటే ముందే మా దగ్గర క్వాంటమ్ వ్యాలీ ఉంది : ఎపీ సీఎంకి కర్ణాటక కౌంటర్..

మీ కంటే ముందే మా దగ్గర క్వాంటమ్ వ్యాలీ ఉంది : ఎపీ సీఎంకి కర్ణాటక కౌంటర్..

ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నవంబర్లోగ అమరావతిలో దేశంలోనే  మొట్టమొదటి సొంతంగా నిర్మించిన 8-క్విట్ క్వాంటం కంప్యూటర్‌ను మోహరిస్తారని ప్రకటించిన తర్వాత, ఎపి కర్ణాటక మధ్య మాటల యుద్ధం మొదలైంది. 

చంద్రబాబు ప్రకటనతో వెంటనే స్పందించిన కర్ణాటక దేశంలో మొట్టమొదటి  క్వాంటం కంప్యూటర్ ఇప్పటికే బెంగళూరులో ఉందని పేర్కొంది.  కర్ణాటక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎన్.ఎస్. బోస్‌రాజు మాట్లాడుతూ ఇండస్ అని పేరుతో బెంగళూరుకు చెందిన QpiAI నిర్మించిన 25-క్విట్ క్వాంటం కంప్యూటర్ ఏప్రిల్ 2025 నుండి సేవలను అందిస్తోంది. ఇండస్ అని పిలువబడే ఈ 25-క్విట్ క్వాంటం కంప్యూటర్ ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ, రక్షణ, అధునాతన పరిశోధన, ఫైనాన్స్ ఇతర రంగాలలో కూడా ప్రపంచ సేవలను అందిస్తోంది అని  అన్నారు.

జూలై 24న సిఎం చంద్రబాబు Xలో  మన రాష్ట్రం ఈ నవంబర్‌లోగా భారతదేశంలోనే మొట్టమొదటి స్వదేశీంగా నిర్మించిన 8-క్విట్ క్వాంటం కంప్యూటర్‌ను @QpiAI సపోర్టుతో అమరావతిలో మోహరించనుంది. నేషనల్ క్వాంటం మిషన్ మద్దతుతో ఈ చొరవ వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్య సంరక్షణను మార్చడమే లక్ష్యం. QpiAI వ్యవస్థాపకుడు శ్రీ నాగేంద్ర నాగరాజన్‌ను అభినందిస్తున్నాను. ఈ ప్రాజెక్టుకు సపోర్ట్ ఇచ్చినందుకు @nqmdstకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. 

మరోవైపు కర్ణాటక క్వాంటం ఆవిష్కరణలో దేశాన్ని నడిపించడమే కాకుండా భారతదేశ క్వాంటం భవిష్యత్తుకు కేంద్రంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూనే ఉంది అని బోస్‌రాజు అన్నారు. వాస్తవాలు, గణాంకాలను పరిగణనలోకి తీసుకునే సంస్కృతిని కూడా మనం పెంపొందించుకోవాలని సూచించారు. భారతదేశంలోని మొట్టమొదటి క్వాంటం రీసెర్చ్ పార్క్ బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో స్థాపించినట్లు, దాని రెండవ దశ కోసం కర్ణాటక క్యాబినెట్ రూ. 48 కోట్లను ఆమోదించిందని కూడా ఆయన పేర్కొన్నారు.

 

For the record: India’s first Quantum computer built indigenously by @QpiAI right here in Bengaluru, Karnataka began it's commercial operations since April 2025. This 25 Qubit Quantum computer named
"INDUS" is already delivering real-world services in sectors like healthcare,… https://t.co/mvjjSR7T6e pic.twitter.com/wjcRyFhcdv

— N.S Boseraju (@NsBoseraju) July 25, 2025